సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. టిల్లు స్క్వేర్ కూడా సక్సెస్ సాధించడంతో సిద్దుకు డిమాండ్ పెరిగింది. దీంతో సిద్దుతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు మరింతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సిద్దు నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయడానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా ప్లాప్ డైరెక్టర్.? ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ కానుంది..?
చదవండి: అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’
సిద్దు ప్రస్తుతం.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు తెలుసు కదా అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాతో స్టైలిష్ట్ నీరజ కోనను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సిద్దను కొత్తగా ప్రజెంట్ చేయనున్నాయని.. ఈ రెండు సినిమాలతో సిద్దుకు మరింత పేరు వస్తుందని వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ కానున్నాయి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు.
అయితే.. సిద్దు ఓ ప్లాప్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఎవరా ప్లాప్ డైరెక్టర్ అంటే.. పరశురామ్. గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన పరశురామ్ ఆతర్వాత సర్కారు వారి పాట మూవీతో ఫరవాలేదు అనిపించాడు కానీ.. ఈమధ్య తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ మూవీతో డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. నెక్ట్స్ మూవీని కార్తితో చేయాలని ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సిద్దుతో సినిమా చేయనున్నాడని తెలిసింది. పరశురామ్ చెప్పిన కథకు సిద్దు ఓకే చెప్పాడని టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. సిద్దును పరశురామ్ ఎలా చూపిస్తాడో.. ఈ సినిమాతో అయినా సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి మరి.