సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువ. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది. పది భాషల్లో త్రీడీతో పాటు ఐమ్యాక్స్ వెర్షన్ లోనూ కంగువ రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు సూర్య. కంగువ చివరి షాట్ కంప్లీట్ చేశాను. యూనిట్ మొత్తంలో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. మా దర్శకుడికి థ్యాంక్స్. కంగువ ఒక భారీ మూవీ, ఒక స్పెషల్ సినిమా. థియేటర్స్ మీతో కలిసి ఈ సినిమాను త్వరగా చూడాలనుకుంటున్నా. అని ఇన్ స్టాలో సూర్య పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ను సూర్య అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇందులో సూర్య లుక్ తో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.