బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోలుకుంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. చికిత్స తీసుకున్న అనంతరం ఈరోజు డిశ్చార్జ్ అయ్యింది. ఆరోగ్యం బాగవడంతో జాన్వీని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇంటికి తీసుకెళ్లారు. హిందీలో జాన్వీ పలు ఆసక్తికర చిత్రాల్లో నటిస్తోంది.
ఇక తెలుగులో రెండు బిగ్ మూవీస్ చేస్తోంది జాన్వీ కపూర్. రామ్ చరణ్ , బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో ఆమె హీరోయిన్ కాగా..త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కనిపించబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది జాన్వీ కపూర్.