ఒక ఊరిలో అందరూ వెజ్ తింటారు. కానీ ఊరిలో కోడి మాయమైంది. ఎలా అన్నట్లుంది రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్ కేసు. ఈ కేసులో రాజ్ తరుణ్ అమాయకంగా మాట్లాడుతున్నాడు, ఆయనతో రిలేషన్ లో ఉన్న లావణ్య తానే మోసపోయానంటోంది. రాజ్ తరుణ్ తో ఎఫైర్ నడుపుతుందని లావణ్య ఆరోపణలు చేస్తున్న కొత్త హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా రాజ్ తరుణ్ కేవలం నాకు కోస్టార్ మాత్రమే అంటోంది. వీళ్లిద్దరు కలిసి తిరగబడరా సామీ సినిమాలో నటించారు. ఇవాళ లావణ్యపై కేసు పెడతానంటూ మీడియా ముందు హడావుడి చేసింది మాల్వీ మల్హోత్రా.
మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ – రాజ్‌తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్‌తరుణ్ నా సహచర నటుడు మాత్రమే. షూటింగ్ అయిపోయి 6నెలలు అవుతోంది. అప్పటి నుంచి రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. నేను లావణ్యను బెదిరించలేదు. లావణ్యతో నాకు పరిచయం లేదు. లావణ్య నాకు కాల్ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది. రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ను అనుమానిస్తోంది. నాపై లావణ్య అసత్యాలు ప్రచారం చేస్తోంది అని చెప్పింది.