నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా నెట్ ఫ్లిక్స్ లో జోరు కొనసాగిస్తోంది. పలు విభాగాల్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. తెలుగు వెర్షన్ నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతుండగా…5వ ప్లేస్ లో హిందీ వెర్షన్, 10వ ప్లేస్ లో తమిళ వెర్షన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా కాబట్టి సకుటుంబ ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ లో పెద్ద సంఖ్యలో ఈ సినిమాను చూస్తున్నట్లు తెలుస్తోంది.
హాయ్ నాన్న సినిమాను వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు శౌర్యువ్ రూపొందించారు. మృణాల్ ఠాకూర్, శృతి హాసన్, బేబి కియారా లీడ్ రోల్స్ చేశారు. గత నెల 7న హాయ్ నాన్న థియేటర్స్ లోకి వచ్చింది. థియేటర్స్ లో సూపర్ హిట్ కాకున్నా…ఇప్పుడు ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ టీమ్ కు హ్యాపీనెస్ ఇస్తోంది.