నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడంలో హాయ్ నాన్న అందుబాటులో ఉంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న వారు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గత నెల 7వ తేదీన హాయ్ నాన్న మూవీ థియేటర్స్ లో రిలీజైంది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు కొత్త దర్శకుడు శౌర్యువ్.
హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా..నాని కూతురు పాత్రలో బేబి కియారా కనిపించింది. ఓ స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ మెరిసింది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్ లో ఆశించినంతగా పర్ ఫార్మ్ చేయలేదు. స్లో నెరేషన్, సెంటిమెంట్ మూవీ కావడంతో ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే బాక్సాఫీస్ దగ్గర నష్టాలు రాకుండా హాయ్ నాన్న బయటపడగలిగింది.