హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతనిపై లావణ్య అనే యువతి తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తనతో రాజ్ తరుణ్ కొన్నేళ్లుగా కలిసి ఉండి ఇప్పుడు మరో హీరోయిన్ తో సంబంధం పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య కంప్లైంట్ లో పేర్కొంది. ఈ కేసుపై స్పందించారు రాజ్ తరుణ్.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ – లావణ్యతో గతంలో రిలేషన్ లో ఉన్నా. ఆమె నాకు మొదట్లో కొన్ని ఫేవర్స్ చేసింది. నా దగ్గర డబ్బులు తీసుకుంది. కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నా. లావణ్యకు డ్రగ్స్ సహా అన్ని అలవాట్లూ ఉన్నాయి. ప్రస్తుతం మరో వ్యక్తితో తాను కలిసి ఉంటోంది. లావణ్య వల్ల నా కెరీర్ చెడిపోవద్దని ఏమీ మాట్లాడకుండా ఉంటున్నా. ఇప్పుడు నాపై కేసు పెట్టింది కాబట్టి లీగల్ గానే ఎదుర్కొంటా. అని అన్నారు.