రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్ గా టాలీవుడ్ కు వస్తోంది భాగ్యశ్రీ భోర్సే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాలను తెలిపింది.
భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ – మంచి అవకాశం ఎదురుచూస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ అవకాశం వచ్చింది. నేను ఏదైనా చేసినప్పుడు హండ్రెడ్ పెర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా వుంటాను. ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తను తెలుగు మార్వాడి గర్ల్. డైరెక్టర్ ఈ క్యారెక్టర్ ని చాలా బ్యూటీఫుల్ గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్ లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసేలా వుంటుంది. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాను. అని చెప్పింది.