లావణ్య చేస్తున్న ఆరోపణలు, పెట్టిన కేసులపై లీగల్ గానే ఫైట్ చేస్తానని అన్నారు హీరో రాజ్ తరుణ్. ఈ రోజు తిరగబడరా సామి సినిమా ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ లావణ్య ఇష్షూపై మాట్లాడారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ – లావణ్య చెప్పేవి అబద్ధాలు, ఆమె పెట్టిన కేసులపై లీగల్ గా పోరాడుతా. అబార్షన్ అయితే ఆ కేసు ఎందుకు పెట్టలేదు. లావణ్య తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతోంది కానీ చూపించడం లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను తప్పించుకుని తిరగడం లేదు. పోలీసుల నోటీసులకు రెస్పాండ్ అయ్యా అన్నారు.
చదవండి: రాజ్ తరుణ్ ను కలవాలంటూ లావణ్య హంగామా
మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ – నాలుగేళ్ల కిందట నాపై దాడికి దిగిన కొందరు వ్యక్తులు ఇప్పుడు లావణ్యతో టచ్ లో ఉన్నారు. వారితో ఉండొద్దని ఆమెకు చెప్పినా వినడం లేదు. నా దృష్టిలో లావణ్య కూడా క్రిమినలే. ఆమె ఎవరో నాకూ నా కుటుంబానికీ తెలియదు. అని చెప్పింది.