పవన్ రేణుదేశాయ్ విడాకుల విషయంలో పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొందరు ఏళ్ల తరబడి రేణు దేశాయ్ ను వేధిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమెను ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. రేణుదేశాయ్ ను వదిన అని పిలుస్తూ ఆమె మరో పెళ్లి చేసుకోవద్దని, ఒంటరిగా మిగిలిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇదెక్కడి న్యాయం పవన్ మరో పెళ్లి చేసుకోవచ్చు, నేను ఒంటరిగా ఉండాలా అని రేణు పలుమార్లు సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది. అయినా వీళ్ల తీరు మారలేదు.
తాజాగా రేణు దేశాయ్ దురదృష్టవంతురాలని అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు రేణు దేశాయ్ స్పందించింది. పవన్ నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయానికి నేనెలా అన్ లక్కీ అవుతాను. మనం 2024లో ఉన్నాం. ఎవరో ఒకరి వల్ల మరొకరు అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఎలా అవుతారు. నేను నా జీవితంలో దక్కిన ప్రతి విషయానికీ అదృష్టవంతురాలిగానే భావిస్తాను. మీరంతా ఇలాంటి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ రిప్లై ఇచ్చింది. రేణు దేశాయ్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.