బాలకృష్ణ తో సినిమా చేయాలని ఉంది: చిరంజీవి

Spread the love

ఇంద్ర చేయడానికి బాలయ్యే కారణం: చిరంజీవి

నందమూరి బాలకృష్ణ సినీ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తిచేసుకున్న వేళ ఆయనకు స్వర్ణోత్సవం నిర్వహించింది సినీ ఇండస్ట్రీ. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి…బాలకృష్ణను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమరసింహారెడ్డి చూసి ఇంద్ర సినిమా చేశానని, దాని క్రెడిట్‌ మొత్తం బాలయ్యదేనని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో బాలకృష్ణ 50ఏళ్లు పూర్తిచేసుకోవడం అరుదైన ఘనతగా కొనియాడిన ఆయన…మరో 50ఏళ్లు ఇలాగే హీరోగా నటించే సత్తా బాలయ్యకు ఇవ్వాలని, ఆ మేరకు భగవంతుడు ప్రసాదించాలని కాంక్షించారు.

చదవండి: నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళను : విష్ణు ప్రియ

బాలయ్య, నేనూ ఎప్పుడూ ఒక్కటే: చిరంజీవి

తన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలకృష్ణ వస్తుంటారని , తమ ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్‌లు కూడా చేస్తారని చెప్పారు మెగాస్టార్. అయితే ఫ్యాన్స్ అనవసర గొడవలు పడుతుంటారని…అయితే మా హీరోల మధ్య మంచి అనుబంధమే ఉందని తెలిపారు. ఫ్యాన్స్‌ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా తామంతా కలిసి ఉన్నామని చెప్పేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూవచ్చామని చెప్పారు. తామంతా ఒక కుటుంబం వాళ్లమన్న మెగాస్టార్ చిరంజీవి…ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలన్నారు.

బాలయ్యతో ఫ్యాక్షన్‌ మూవీ చేయాలనుంది: మెగాస్టార్‌

ఫ్యాక్షన్ చిత్రాలు చేయాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. ఇంద్రలాంటి ఫ్యాక్షన్ చిత్రాన్ని తాను చేయడానికి కారణం బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డే ఆదర్శమన్న చిరు…బాలకృష్ణతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బాలయ్య స్వర్ణోత్సవంలో చిరంజీవి రివీల్ చేయడం ఇండస్ట్రీలో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.

https://www.instagram.com/reel/C_YjwzYySHC/?igsh=Mmpud2sxY2oyZjgz

Hot this week

500 వందల కోట్లు కొల్లగొట్టిన ‘ దేవర ‘

దేవర’ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు అభిమానులు, బృందం, ప్రేక్షకులు, పంపిణీదారులు,...

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా రశ్మిక మందన్న

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన నేషనల్...

“లవ్ రెడ్డి” ట్రైలర్ రిలీజ్ చేసిన ఎస్ కేఎన్.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా "లవ్ రెడ్డి"...

అప్పుడు నాగార్జున “డాన్” ఫ్లాప్..ఇప్పుడేమవుతుందో

నాగార్జున కెరీర్ లో ఫ్లాప్ సినిమాల్లో డాన్ ఒకటి. లారెన్స్ దర్శకత్వం...

రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘బఘీర’ అక్టోబర్ 31న విడుదల.

రోరింగ్ స్టార్ శ్రీమురళి, ప్రశాంత్ నీల్, డాక్టర్ సూరి, విజయ్ కిరగందూర్,...

Topics

సాయి దుర్గ తేజ్ #SDT18 “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” రిలీజ్.

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

శ్రుతి “డెకాయిట్”ను వదిలేసిందా ?

శ్రుతి హాసన్ గ్లామర్ ఉన్న ఎంటర్ టైనింగ్ మూవీస్ తో పాటు...

వారసుడి కోసం దిల్ రాజు మరో ప్రయత్నం

తొలిప్రేమ ఓ సంచలనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో...