తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ రెట్టింపు అవుతున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల వసూళ్లు రాగా…హిట్ టాక్ తో రెండో రోజు భారీ జంప్ కనిపించింది. రెండో రోజు 4 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. మూడో రోజైన ఇవాళ ఆదివారం మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నార్త్ ఏరియాల్లో డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ. గతంలో నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా హిందీ వెర్షన్ బాగా వసూళ్లు చేసింది.
ఇప్పుడు హనుమాన్ సినిమాకు కూడా అదే సక్సెస్ రిపీట్ చేస్తోంది. సండే కు ఈ సినిమా కలెక్షన్స్ పది కోట్ల రూపాయలకు చేరనున్నాయి. ఓటీటీ ట్రెండ్ వచ్చాక ఏ భాషలో బాగున్నా…అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హనుమాన్ బాగుందనే టాక్ నార్త్ కు కూడా చాలా స్పీడ్ గానే చేరినట్లుంది. ఈ సినిమాకు బుక్ మై షోలో పది లక్షల టికెట్స్ అమ్ముడవడం హనుమాన్ సక్సెస్ కు ఓ ప్రూవ్ గా చెప్పుకోవచ్చు.