ఇండియన్ 2 సినిమా రిలీజ్ వాయిదా పడనుందనే వార్తల నేపథ్యంలో అవన్నీ రూమర్స్ అని ప్రూవ్ చేస్తూ ప్రమోషనల్ యాక్టివిటీస్ వేగవంతం చేశారు మేకర్స్. ఇండియన్ 2 తెలుగులో భారతీయుడు 2 పేరుతో రిలీజ్ కానుంది. జూలై 12నే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
భారతీయుడు 2 సినిమా ట్రైలర్ ను ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు పాన్ ఇండియా రిలీజ్ కు వస్తోందీ మూవీ. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియ భవానీ శంకర్, సిద్ధార్థ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.