కొన్ని సినిమాలకు వెళ్తే… కొన్ని కటౌట్స్ చూసి నమ్మేయాలి డ్యూడ్…ఇది ఒకప్పటి మాట. కంటెంట్ బాగుంటే కటౌట్స్ పనిలేదన్నది నేటి మాట. అవును…బాలీవుడ్‌లో రెండ్రోజుల క్రితం రిలీజైన స్త్రీ2 సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కంటెంట్ బాగుంటే సినిమాలను ఆదరించే నేటి సినీప్రేక్షకలోకం ఈ సినిమాకూ కూడా అంతేవిధంగా బ్రహ్మరథం పడుతోంది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై రోజురోజూ గుడ్‌టాక్‌తో దూసుకెళ్లిపోతుంది.
పెట్టింది 50 కోట్లు…
వస్తోంది మాత్రం ఓ సునామీలా..!
50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన స్త్రీ2 మూవీ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే అంచనాలకు మించి రూ.51 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వేటికీకూడా ఈ స్థాయి కలెక్షన్లు రాలేదన్నది ముంబై టాక్. వరుసగా ఐదురోజులు సెలవులు రావడం ఓ రకంగా ప్లస్ అయితే…మరోవైపు ఆగస్టు 15న రిలీజైన చిత్రాలన్నీ చతికలపోవడం స్త్రీ2 కి కలిసొచ్చిందని అంటున్నారు సినీక్రిటిక్స్