నందమూరి బాలకృ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ 6 మోక్షజ్ఞ పుట్టినరోజు. ఆ రోజున ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మోక్షజ్ఞను ఏ పాత్రలో చూపించనున్నాడు..? అసలు కథ ఏంటి..? ఏ తరహా చిత్రం..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. ఈ ప్రశ్నలకు సమాధానం సెప్టెంబర్ 6న దొరకబోతుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర సీనియర్ హీరోతో చేయించాలి అనుకుంటున్నారట. ఇప్పుడు ఆ సీనియర్ హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఆ సీనియర్ హీరోను బాలీవుడ్ నుంచి రంగంలోకి దింపుతారా..? లేక టాలీవుడ్ హీరోనే తీసుకుంటారా..? అనేది తెలియాల్సివుంది. అయితే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పేరు వినిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో మోక్షజ్ఞకు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
చదవండి: “పుష్ప 2” పుకార్లకు చెక్ పెట్టిన ఐకాన్ స్టార్
ఇలా ఈ క్రేజీ మూవీ గురించి ఇంట్రస్ట్ న్యూస్ ప్రచారంలోకి వస్తుండడంతో నందమూరి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. హనుమాన్ మూవీ వలే డేవోషనల్ టచ్ తోనే ఈ సినిమా కథ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మరి.. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.