హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి కొత్త అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
చదవండి: అల్లు శిరీష్ “బడ్డీ” టికెట్ రేట్స్ తగ్గాయ్
రీసెంట్ గా కన్నప్ప సినిమా నుంచి మధుబాల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె ఈ చిత్రంలో చెంచు వీరనారి పన్నాగా పాత్రలో కనిపించనుంది. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ రిలీజ్ అనౌన్స్ చేశారు.