రవితేజ ఈగిల్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న రిలీజ్ చేయాల్సిఉంది. అయితే చివరి నిమిషంలో విడుదల నిర్ణయాన్ని మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈగిల్ సినిమాను ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో సంక్రాంతి బరిలో ఓ బిగ్ ఫిల్మ్ లేనట్లే అనుకోవాలి.
ప్రస్తుతానికి నా సామి రంగ, సైంధవ్, హనుమాన్, గుంటూరు కారం సినిమాలు సంక్రాంతి రేసులో పోటీ పడుతున్నాయి. ఈగిల్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది.