బెయిల్ ఇవ్వండి..అవార్డు అందుకోవాలి…
కోర్టులో జానీమాస్టర్ మరో బెయిల్ పిటిషన్..!
తనకు ఇటీవల బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు వచ్చిందని, ఢిల్లీ వెళ్లి అందుకోవాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనకు ఐదురోజుల గడువుతో బెయిల్ ఇవ్వండని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జానీమాస్టర్. కాగా, పిటిషన్‌పై ఈ నెల 7న విచారణ చేపడతామని రంగారెడ్డి పోక్సో కోర్టు తెలిపింది.
చదవండి: మంత్రి సురేఖ మాటలపై నాగార్జున సీరియస్..?
అయితే జానీమాస్టర్ బెయిల్‌పిటిషన్‌ను సవాల్ చేస్తూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. జానీమాస్టర్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని, అతడికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అసిస్టెంట్ కొరిగ్రాఫర్‌పై రేప్ అండ్ పోక్సో కేసులో… గతనెల 19న గోవాలో అరెస్ట్ అయిన జానీమాస్టర్‌కు తొలుత జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో నాలుగురోజులపాటు పోలీస్ కస్టడీ అనంతరం జానీమాస్టర్‌ను కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌ను అక్టోబర్ 3వరకూ ధర్మాసనం పొడిగించింది.