జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..!
బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రాగా రంగారెడ్డి కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టివేయడంతో…జానీమాస్టర్ ఇప్పట్లో జైలు గోడలు చీల్చుకుని వచ్చేలా కనిపించడం లేదు. ఇదిలాఉంటే మొన్నామధ్య ఢిల్లీ వెళ్లి జాతీయ అవార్డు తీసుకోవాల్సి ఉందని, అది తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని కోర్టును అభ్యర్థించగా అందుకు కోర్టు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, తనకు కేటాయించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అవార్డును కేంద్రం రద్దుచేయడంపై ఆయన జైలుకే పరిమితం అయిపోయారు. అంతేనా, కొడుకు అరెస్ట్ అయ్యాడన్న మనస్తాపంతో తల్లి గుండెపోటుకు గురవడం జైలులో ఉన్న జానీమాస్టర్‌కు మరింత బాధను కలిగించింది. జానీ భార్య అయేషా నెల్లూరు బొల్లినేని ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ్‌వర్మ కంప్లైంట్‌తో రేప్ అండ్ పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న జానీమాస్టర్‌ను సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి చంచల్‌గూడ జైలు గోడల మధ్యే బతుకుతున్నారు జానీమాస్టర్. అయితే, పుష్ప మూవీ పెద్దలే తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేయించారని ఇటు జానీ భార్య అయేషా ఆరోపించగా, ఆమె ఆరోపణలకు తగ్గట్టుగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఏ మూవీ చేసినా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ్‌వర్మకు అవకాశాలు తప్పక ఉంటాయని బన్నీ మేనేజర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి భరోసా ఇవ్వడం కొసమెరుపు.