కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఓ భారీ మైథలాజికల్ మూవీకి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమా సూర్యకు బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కానుంది. కర్ణ పేరుతో దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా రూపొందించనున్నారు. హై బడ్జెట్ మూవీగా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే జాన్వీ కెరీర్ లో ఇదొక ప్రెస్టీజియస్ మూవీ కానుంది.
కర్ణ సినిమాలో జాన్వీ కపూర్ ద్రౌపది క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంగువ ఫినిష్ చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ఇది రిలీజైన వెంటనే సూర్య కర్ణ సినిమా సెట్ లో అడుగుపెడతారని తెలుస్తోంది. సూర్య డైరెక్టర్ సుధా కొంగరతో మరో మూవీ ప్రకటించారు.