తమిళనాట స్టార్ హీరో కొడుకు మెగాఫోన్ పట్టబోతున్నాడు. అయితే యాక్టింగ్ కన్నా డైరెక్షన్‌పైనే ఫోకస్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు. విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్. ఒక భారీ నిర్మాణ సంస్థలో తన తొలి సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నారని నడిగర్ సంఘంలో పెద్దటాక్ కూడా నడుస్తోంది. సాక్షాత్తూ లైకా ప్రొడక్షన్ వాళ్లే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. జాసన్ సంజయ్‌తో కలిసి పనిచేయడం తమకు గొప్ప విషయమని కూడా అన్నారట. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారని నిర్మాత సుభాస్కరన్ మొన్నీమధ్య చెప్పుకొచ్చారు కూడా. తను రాసుకున్న కథను ఒకేచేసి డైరెక్షన్ చేసేలా ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌కి ఇటు థ్యాంక్స్‌కూడా చెప్పాడు మన సంజయ్.
చదవండి: కిరణ్ అబ్బవరం “క” సినిమాను మలయాళంలో రిలీజ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్
సదరు లైకా ప్రొడక్షన్ బ్యానర్‌తో ఒప్పందం చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి కూడా. ఇదిలాఉంటే విజయ్-సంగీత దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు జాసన్ సంజయ్ పెద్దవాడుకాగా, ఆ తర్వాత కూతురు దివ్యా సాషా జన్మించింది. వీళ్లిద్దరూ బాలనటులుగా విజయ్ చిత్రాల్లో నటించారు. అయితే జాసన్‌కు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌లేకపోవడంతో లండన్, టొరంటో ఫిల్మ్ స్కూళ్లలో జాయిన్ అయి ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా కంప్లీట్ చేశాడు.
సందీప్ కిషన్ హీరోగా డెబ్యూ మూవీ..?
లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో సంజయ్ మెగాఫోన్ పట్టబోతున్నాడన్న టాక్ ఓవైపు నడుస్తుండగానే…మరో ఇంటస్ట్రింగ్ పాయింట్ కూడా రివీల్ అయింది. సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేయబోయే చిత్రమే సంజయ్ డైరెక్షన్ చేసే డెబ్యూమూవీ అని తెలిసింది. అయితే ఇది సదరు లైకా ప్రొడక్షన్ బ్యానరేనా? లేక ఇంకేమైనా అనేది తేలాల్సి ఉంది.