విడాకులకు జెన్నీఫర్ లోపెజ్ దరఖాస్తు..?
తన భర్త, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు కావాలని జెన్నిఫర్ లోపేజ్ దరఖాస్తు చేసుకుంది. దీంతో కేవలం రెండేళ్ల వివాహ బంధానికి అప్పుడే ఆ ఇద్దరూ బ్రేకప్ చెప్పేస్తున్నార్న వార్త హాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.
లాస్ ఏంజిల్స్ కౌంటీ కోర్టులో మంగళవారం జెన్నిఫర్ లోపేజ్ డైవర్స్ ఫైల్ చేశారు. వాస్తవానికి 2022లో ఆ ఇద్దరూ లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకుని… ఆ తర్వాత జార్జియాలో భారీ విందు ఏర్పాటు చేశారు. చిత్రమేంటంటే…వీరిద్దరూ 2002లోనే ఒకరినొకరు పరిచయం అయ్యారు. ఆ సమయంలోనే ఒక్కటవ్వాలని నిర్ణయించారు. కానీ రెండు దశాబ్ధాల తర్వాత పెళ్లి చేసుకున్న వీరు… రెండేళ్లకే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కడంతో అందరినోళ్లల్లో నిలిచారు.
చదవండి: అనకాపల్లిలో ఆర్తనాదాలు..?
జెన్నీఫర్ భారీగా భరణం డిమాండ్..?
ముందు ఆస్తులు బయటపెట్టాలన్న కోర్టు..!
పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ ఆస్తి సుమారు 400 మిలియన్ డాలర్లపైనే ఉంటుంది. అయితే బెన్ అప్లెక్‌ను పెళ్లిచేసుకున్నాక జెన్నీఫర్ భారీ స్థాయిలో ఖర్చుచేశారని…ఇప్పుడా ఖర్చుమొత్తం అతని నుంచి లాగేయాలని ప్రయత్నించగా…బెన్ అప్లెక్ నిరాకరించడంతో అక్కడున్న చట్టాల ప్రకారం…భర్త ఆస్తిలో సగం వాటా కోరుతూ భారీ ఎత్తున జెన్నీఫర్ భరణం డిమాండ్ చేసింది. అయితే జెన్నీఫర్ కోర్టు మెట్లెక్కిన అనంతరం ధర్మాసనం డాక్యుమెంట్లు రిలీజ్ చేసింది. దాని సారాంశం ప్రకారం జెన్నీఫర్, అప్లెక్ ఇద్దరూ తమ, తమ ఆర్థిక సమాచారం వెల్లడించాల్సి ఉంటుంది. ముందుగా జెన్నీఫర్ తన ఆర్థిక వివరాలు తెలిపిన తర్వాత, మరో 60 రోజుల్లో అప్లెక్ కూడా తన ఆస్తుల వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఇరువురూ వివరాలు తెలపకపోతే, అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుందని..రేడార్ ఆన్‌లైన్ అనే ఆ దేశ మీడియా ఓ కథనం వెలువరించింది.