రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే ఛాన్సే లేదని తెలుస్తోంది. ఈ అవకాశం బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ కు దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జాన్వీ ఎన్టీఆర్ దేవర సినిమా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వాళ్ల మదర్ శ్రీదేవి తెలుగులో క్రియేట్ చేసిన ఒక హిస్టరీకి గుర్తుగా జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.
రామ్ చరణ్ ఫాదర్ చిరంజీవి, జాన్వీ మదర్ శ్రీదేవి ఎంత సూపర్ హిట్ పెయిర్ అనేది ప్రేక్షకులందరికీ తెలుసు. ఇప్పుడు రెండో తరం కూడా కలిసి నటించడం అనేది ఒక క్రేజ్ తీసుకొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు చరణ్ సినిమాను విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా జాన్వీ కపూర్ బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ చేస్తున్నారు. ఆర్సీ 16లో నటించడం ద్వారా జాన్వీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద సినిమాల్లో కనిపించనుంది.