నానికి జంటగా జాన్వీ..?

Spread the love

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే.. అక్కడ అంతగా రాణించలేకపోయింది.. టాప్ లీగ్ లోకి చేరలేకపోయింది. టాలీవుడ్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్‌ ల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే ఛాన్స్ దక్కించుకున్న జాన్వీ ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆఫర్ సొంతం చేసుకుందని.. అది నానికి జంటగా నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఇది నిజమా..?

జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని టాలీవుడ్ మేకర్స్ గట్టిగానే ట్రై చేశారు కానీ.. చాన్నాళ్లు జాన్వీ నో చెబుతూ వచ్చింది. అలాగని తెలుగులో నటించకూడదు అని కాదు.. ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేది. ఆఖరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించే దేవర మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. సెప్టెంబర్ 27న ఈ క్రేజీ మూవీ దేవర రిలీజ్ కానుంది. అయితే.. దేవర రిలీజ్ కాకుండానే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించే మూవీలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది.

చదవండి: వివాదంలో ‘ఛీ ఛీ’ కెమెరాల వ్యవహారం..!

ఎన్టీఆర్, చరణ్ ల తర్వాత జాన్వీ.. నానికి జంటగా నటించనుందని వార్తలు వస్తున్నాయి. నాని దసరా అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో నటించేందుకు జాన్వీని కాంటాక్ట్ చేశారట కానీ.. ఇంకా ఏ విషయం చెప్పలేదని ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి నానిని అడిగితే.. మా చిత్ర‌బృందం ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతోందేమో నాకు తెలీదు. స‌రిపోదా శ‌నివారం షూటింగ్ బిజీలో ఉండడంతో ఆ ప్రాజెక్ట్ గురించి ప‌ట్టించుకోలేదు అని నాని చెప్పాడు. నానికి తెలియ‌కుండా సినిమాలో హీరోయిన్‌ని ఫిక్స‌వ్వ‌డం, ఆమెను సంప్ర‌దించ‌డం జ‌రిగే విష‌యాలు కావు. జాన్వీని సంప్ర‌దిస్తే అది నానికి తెలిసే జ‌రుగుతుంది.

ఈ విష‌యంలో ఎలాంటి డౌటూ అవ‌స‌రం లేదు. నిజానికి జాన్వీ అయితే బాగుంటుంద‌ని టీమ్ మొత్తం ఫిక్స‌య్యింది. ఆమెతో మాట్లాడిందని సమాచారం. మరో విషయం ఏంటంటే.. దేవర రిజెల్ట్.. ఆ సినిమాలో ఆమె పర్ ఫార్మెన్స్ అన్నీ చూసుకుని నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారట. అందుకనే హోల్డ్ లో పెట్టారని టాక్. సో.. నాని, శ్రీకాంత్ ఓదెల మూవీలో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రావాలంటే దేవర రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...