రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. ఈ విపత్తు సమయంలో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు ఎన్టీఆర్. ఏపీ, తెలంగాణకు 50 లక్షల చొప్పున కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఎన్టీఆర్ వరద సాయాన్ని ప్రకటిస్తూ – రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళం గా ప్రకటిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.
చదవండి: బాలయ్య స్వర్ణోత్సవం.. హిట్టా, ఫట్టా ?
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఏపీకి వరదసాయంగా 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.