అమ్మమ్మగారి ఇంటికి జూ.ఎన్టీఆర్..!
జూ.ఎన్టీఆర్…ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ వైబ్రేషన్..స్వర్గీయ నందమూరి తారకరామారావు ముద్దుల మనవడు…ఇప్పుడు నందమూరి వంశంలో బాలయ్య తర్వాత అంతటి గొప్పనటుడుగా ఎన్టీఆర్ చేరిపోయారు. అయితే జూ.ఎన్టీఆర్ గురించి ప్రతీది తెలుసుకోవాలన్న కాంక్ష తన అభిమానులుగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు ప్రతిఒక్కరిలోనూ ఉంటుంటాయి. అయితే శనివారం జూ.ఎన్టీఆర్ బెంగలూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లడంతో ఆయనకు అత్యంత దగ్గరి బంధువులు గురించి ఒక విషయం రివీల్ అయింది. జూ.ఎన్టీఆర్ అమ్మమ్మ గారి ఊరు ఏమై ఉంటుందన్న చాలామంది అభిమానుల సందేహాలకు ఓవరాల్‌గా తెరపడింది. అవునండి..ఇది నిజం…తల్లి షాలినితో కలిసి కర్ణాటక పర్యటనకు బయల్దేరిన ఆయన…అమ్మమ్మగారి ఊరు చుట్టేశారు.
ఇది కృష్ణుడి స్క్రీన్‌ప్లేనన్న ఎన్టీఆర్..?
చాలామందికి అమ్మమ్మగారి ఊరు వెళ్లడమంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో అయితే మరీనూ. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, అమ్మతో కలిసి అమ్మమ్మగారి ఊరు వెళ్లిపోవడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే, తన తల్లి 40ఏళ్ల కలను నెరవేర్చేందుకు జూ.ఎన్టీఆరే స్వయంగా ఈ టూర్ ప్లాన్ చేశారట. ఉడిపి ఆలయాన్ని సందర్శించాలని అమ్మ ఎప్పటినుంచో కోరుకుంటుందని, ఇన్నాళ్లకు ఆ సమయం కుదిరిందని, ఇదంతా చూస్తుంటే కృష్ణుడి స్క్రీన్‌ప్లే అని జూ.ఎన్టీఆర్ చమత్కరించారు. టూర్ షెడ్యూల్‌లో భాగంగా ముందుగా తల్లితో కలిసి అమ్మమ్మగారి ఊరు కుందాపుర చేరుకుని, అక్కడి బంధువులతో సరదాగా గడిపి…ఆ తర్వాత ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు.
చదవండి: సెప్టెంబర్ 7 నుంచి వైన్‌షాపులు బంద్..?
జూ.ఎన్టీఆర్‌కు రిషబ్‌శెట్టి ఘనస్వాగతం..!
కర్ణాటక పర్యటనకు వెళ్లిన జూ.ఎన్టీఆర్‌కు బెంగలూరు ఎయిర్‌పోర్టులో కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టి ఘనస్వాగతం పలికారు. అలాగే జూ.ఎన్టీఆర్ తల్లి షాలినికి పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఎయిర్‌పోర్టులో మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు పూర్తిగా జూ.ఎన్టీఆర్ కన్నడ భాషలోనే అలవోకగా సమాధానమిచ్చారు. ఈ పర్యటనలో తన వెంట ఎంతో ఇష్టమైన స్నేహితుడు రిషబ్‌శెట్టి ఉండటం ఎంతో సంతోషదాయకమన్నారు జూ.ఎన్టీఆర్. రిషబ్‌శెట్టితోపాటు ప్రశాంత్ నీల్ కూడా జూ.ఎన్టీఆర్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ ముగ్గురి పిక్స్, అలాగే జూ.ఎన్టీఆర్ మీడియాకు కన్నడలో అలవోకగా ఇచ్చిన సమాధానాలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.