హీరో కార్తీకు విజయాన్ని అందించిన చిత్రాల్లో సర్దార్ ఒకటి. గతేడాది దీపావళి టైమ్ లో ఈ సినిమా రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసింది. ఇప్పుడీ సక్సెస్ ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నారు కార్తీ. తాజాగా సర్దార్ 2 సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సర్దార్ సినిమా గతేడాది తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది.
దీపావళికి వచ్చిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కించనున్నారు. ప్రిన్స్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. కార్తీ సర్దార్ లో వివిధ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన ఇండియన్ రా ఏజెంట్ క్యారెక్టర్ లో కనిపించిన సర్దార్ కథకు కొనసాగింపుగా సర్దార్ 2 తెరకెక్కనుంది. ఈ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.