ప్రభాస్ హీరోగా నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కి 2898ఎడి బాలీవుడ్ లో రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ రేర్ రికార్డ్ పై కన్నేసింది. ఇప్పటిదాకా సౌత్ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 మాత్రమే అందుకున్న 300 క్రోర్ మార్క్ పై కల్కి గురి పెట్టింది.
చదవండి: ఆయ్ థీమ్ సాంగ్ లాంచ్
ప్రస్తుతం కల్కికి దాదాపు 270 కోట్ల రూపాయల వసూళ్లు హిందీలో వచ్చాయి. మరో 30 కోట్ల రూపాయలు అందుకుంటే ఈ సినిమా 300 క్రోర్ మార్క్ చేరుకుంటుంది. అయితే అక్కడ ఈ వీక్ కొత్త సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. కల్కి స్క్రీన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి. దీంతో ఈ వీక్ ఎండ్ కల్లా కల్కి 300 మార్క్ చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వికీ కౌశల్ బ్యాడ్ న్యూస్ సినిమా నార్త్ థియేటర్స్ లో సందడి చేస్తోంది.