స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పడుకోన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ఇంకా నాలుగు నెలల టైమ్ ఉన్నందున మిగిలిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తామని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మే 9 వైజయంతీ మూవీస్ సంస్థలో జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రోజు. అందుకే ఈ తేదీని స్పెషల్ గా ఎంచుకుంది కల్కి టీమ్.