స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD సినిమా రిలీజ్ డేట్ పై నెట్టింట వస్తున్న వార్తలు మూవీ టీమ్ కు చేరినట్లు ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. కల్కి 2898AD రిలీజ్ డేట్ పై మరో వారం రోజుల్లో క్లారిటీ ఇస్తారట. అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సంక్రాంతికే కల్కి 2898AD సినిమా విడుదల కావాల్సింది. అయితే భారీ ప్రాజెక్ట్ కావడం, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, మేకింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకోవడం, భారీ కాస్టింగ్, వారి డేట్స్ ఇవన్నింటి దృష్ట్యా అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయలేకపోయారు.
ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఈ సమ్మర్ ఎండ్ లో కల్కి 2898AD రిలీజ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందట. త్వరలోనే మిగత షూటింగ్ పూర్తి చేసి, దాంతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలని టీమ్ భావిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పడుకోన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.