స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా కల్కి రన్ టైమ్ గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు షాక్ ఇస్తున్నాయి. ఈ సినిమాకు మూడు గంటలకు పైనే రన్ టైమ్ ఉందంటూ సెన్సార్ నుంచి లీక్స్ వచ్చాయి. దాంతో ఇది లెంగ్తీ సినిమానే అనే క్లారిటీకి వస్తున్నారు సినీ ప్రియులు. కల్కి సినిమా మరో వారం రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ వారు చూసి ప్రశంసించారు.
సెన్సార్ సర్టిఫికెట్ ఏంటనేది మూవీ టీమ్ అనౌన్స్ చేయాల్సిఉంది. మన సినిమా యావరేజ్ రన్ టైమ్ రెండున్నర గంటలు. ఇలా చూస్తే మరో అరగంట కల్కి ఎక్కువే ఉండనుంది. ఈ సినిమా వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు. నిన్న ముంబై ఈవెంట్ సక్సెస్ అయిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక భారీ ఈవెంట్ చేసేందుకు కల్కి టీమ్ రెడీ అవుతోంది.