యూఎస్ బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అక్కడ బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల రికార్డులను మొదటిరోజే బీట్ చేసింది కల్కి. ప్రీ బుకింగ్స్ లో కల్కికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన హైప్ తో అమెరికాలోని అన్ని భాషల ఇండియన్స్ ఈ సినిమాను చూసేందుకు టికెట్ బుకింగ్స్ చేసుకున్నారు. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కల్కికి 3.8 మిలియన్ డాలర్స్ వసూళ్లు దక్కాయి.
ఇది ఆర్ఆర్ఆర్, బాహుబలి కంటే ఎక్కువ. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ తో కలుపుకుని కల్కి 5 మిలియన్ మార్క్ టచ్ అయ్యింది. ఓ పెద్ద హీరో అయినా తన సినిమా ఫుల్ రన్ లో 5 మిలియన్ టచ్ కావాలంటే చెమటోడ్చాల్సిందే. అలాంటిది కల్కి సునాయాసంగా మొదటి రోజుకే ఈ ఫీట్ సాధించింది. ప్రభాస్ తో పాటు అమితాబ్, దిశా పటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటం కూడా కల్కి కి ఈ రేంజ్ కలెక్షన్స్ అందించింది అనుకోవచ్చు.