వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా మరో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల మార్క్ ను 14 రోజుల్లో అందుకుంది. నిన్నటికి వరల్డ్ వైడ్ గా 1002 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మన దేశంలో వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన నాలుగైదు సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి.
ప్రభాస్ కు బాహుబలి 2 తర్వాత మళ్లీ వెయ్యి కోట్ల గ్రాసర్ అనే ఘనత దక్కించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఓవర్సీస్ లో 17 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకున్న కల్కి బాలీవుడ్ లో 300 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి. కల్కి వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లపై అమితాబ్ బచ్చన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కల్కిలో భాగమవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.