కలియుగాంతంలో గంగ ఎండిపోయి మనుషులు అంతం మొదలవుతుంది. ఆ సమయంలో ఆధిపత్యం కోసం మూడు ప్రపంచాలు కాశీ, షంబాలా, కాంప్లెక్స్ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది అనేది కల్కి ఫైనల్ ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తోంది. ఈ మూడు ప్రపంచాల మధ్య పోరును కురుక్షేత్రం జరిగినప్పుడు ఎంత హంగామా జరిగిందో అంతే భారీగా అదే స్ఫూర్తితో రూపొందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఫైనల్ ట్రైలర్ తో కల్కి కథపై మరింత క్లారిటీ వచ్చింది.
కలియుగాంతంలో ప్రపంచానికి శత్రువులుగా మారిన వారిని చంపేందుకు కల్కి అవతారంగా బిడ్డను కనబోతుంది దీపిక. ఆమె ఆ బిడ్డను కనకముందే చంపేయాలని కాంప్లెక్స్ అధిపతి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాల నుంచి దీపికను కాపాడేందుకు అశ్వత్థామ (అమితాబ్) సర్వశక్తులూ ఒడ్డి పోరాడతాడు. కాశీలో ఏ పనీ లేకుండా డబ్బు కోసం ఏదైనా చేసే భైరవ (ప్రభాస్)కు దీపికను చంపే బాధ్యత అప్పగిస్తాడు కాంప్లెక్స్ అధిపతి. దీపిక నేపథ్యం తెలియనిక భైరవ ఆ డబ్బు కోసం దీపికను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ, భైరవ మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. భైరవ నిజం తెలుసుకుని దీపికను ఎలా కాపాడాడు, తద్వారా ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది సినిమాలో చూడాలి.