స్టార్ హీరో ప్రభాస్ కొత్త మూవీ కల్కి 2898ఎడి టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. అదనపు షోస్ , టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్ మూవీస్ నష్టపోకుండా వారం రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కల్కి చిత్ర టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కల్కి చిత్ర టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది. 27న ఉదయం 5:30 షోకు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం, వారం రోజులపాటు ఐదు షోకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.