118, ఎంతమంచి వాడవురా, నా నువ్వే వంటి వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న హీరో కల్యాణ్ రామ్ కు ఊరటనిచ్చింది బింబిసార. ఆయనకు పటాస్ సినిమా తర్వాత మళ్లీ ఓ జెన్యూన్ హిట్ ను ఇచ్చిందీ సినిమా. బింబిసార సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందించారు. టైమ్ ట్రావెల్ తో వందల ఏళ్ల నుంచి కలియుగానికి వచ్చిన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడి కథను ఆకట్టుకునేలా ఈ సినిమాలో చూపించారు.
తనకు సక్సెస్ ఇచ్చిన సినిమాను వదలని కల్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసార 2 అనౌన్స్ చేశారు. బింబిసారకు ప్రీక్వెల్ గా బింబిసార 2 ఉండనుంది. బింబిసారుడికి ముందు త్రిగర్తల రాజ్యాన్ని ఏలిన రాజు కథను బింబిసార 2లో చూపించబోతున్నారు. అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న బింబిసార 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.