రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ ఫలితాన్ని చూసింది భారతీయుడు 2. దాదాపు 30 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకుల్నీ మెప్పించలేకపోయింది. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు 2 సినిమా అంతటా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తప్ప సినిమాలో ఇంకేం లేదని ప్రేక్షకులు తేల్చారు. విమర్శకుల నుంచి కూడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ మూవీ నిడివి తగ్గించింది సినిమా టీమ్.
దాదాపు 12 నిమిషాలు ఫుటేజ్ కట్ చేసినట్లు భారతీయుడు 2 టీమ్ తెలిపింది. ఈ రోజు మ్యాట్నీ షోస్ నుంచే ఈ కొత్త వెర్షన్ భారతీయుడు 2 సినిమా అన్ని థియేటర్స్ లో ప్రదర్శితమవుతోందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా..సిద్ధార్థ్, ప్రియభవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫుటేజ్ తగ్గించినా ఏ మాత్రం ఫలితం ఉండకపోవచ్చు.