కమల్ హాసన్ హీరోగా దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ థగ్ లైఫ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కాస్ట్ అండ్ క్రూ ఫొటోస్ ఉన్నాయి. చివరలో థగ్ లైఫ్ షూటింగ్ బిగిన్స్ అని వెల్లడించారు. నాయకుడు సినిమా తర్వాత మూడు దశాబ్దాల విరామంతో కమల్ హాసన్, మణిరత్నం కలిసి సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మూవీస్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థగ్ లైఫ్ సినిమా రాబిన్ హుడ్ లాంటి ఒక దొంగ జీవితంలో జరిగిన సంఘటనలను చూపించబోతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.