బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఆమె బాలీవుడ్ లోని అనేక ఇష్యూస్ పై మాట్లాడుతుంటుంది. విమర్శలు చేస్తుంది. ఇదే క్రమంలో యానిమల్ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేసింది. సందీప్ వంగా తన సినిమాలో అవకాశం ఇచ్చినా నటించను అని చెప్పేసింది. యానిమల్ మూవీలో మేల్ డామినేషన్ చూపించడంపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి డైరెక్టర్ సందీప్ వంగాలోనే అలాంటి మేల్ డామినేషన్ బిహేవియర్ కనిపిస్తుందని కంగనా ఫైర్ అయ్యింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా మాట్లాడుతూ కంగనా నటన అంటే తనకు ఇష్టమని, మంచి కథ కుదిరితే ఆమెను అప్రోచ్ అయి సినిమా చేస్తానని అన్నాడు. దీనిపై కంగనా స్పందించింది. నువ్వు నాకోసం కథలు సిద్ధం చేయకు. నేను నీ మూవీలో నటించను. ఎందుకంటే నేను నీ మూవీలో నటిస్తే కథలో నీ మేల్ డామినేషన్ తగ్గిపోతుంది. నీ సినిమాలూ ఆడవు. నువ్వు సూపర్ హిట్ సినిమాలు చేస్తావు. ఇండస్ట్రీకి నీ అవసరం ఉంది. అంటూ మండిపడింది. ఏ క్రియేటివ్ అంశానికైనా రివ్యూస్ ఉంటాయని, అలాగే యానిమల్ సినిమాను నేను రివ్యూ చేశానని కంగనా చెప్పుకుంది.