స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా ట్రైలర్ నిన్న రిలీజైంది. డిజిటల్ వ్యూస్ లో ఈ ట్రైలర్ దూసుకెళ్తోంది. కంగువ ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే 15 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సోషల్ మీడియాలో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ కు ట్రైలర్ కు భారీ వ్యూస్ ప్రూవ్ గా చెప్పుకోవచ్చు.
చదవండి: ఈ వీక్ సినిమాల్లో ప్రమోషన్స్ లో ముందున్న “మిస్టర్ బచ్చన్”
ట్రైలర్ లో సూర్య పర్ ఫార్మెన్స్, హై స్టాండర్డ్ మేకింగ్ వ్యాల్యూస్ ఆకట్టుకున్నాయి. పీరియాడిక్ యాక్షన్ స్టోరీతో దర్శకుడు శివ తెరకెక్కించిన కంగువ మూవీ కోసం సూర్య ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. కంగువ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.