ఓటీటీల ట్రెండ్ నడుస్తున్న కాలంలో ప్రతి భాషలో స్టార్ మరో భాషలోనూ స్టారే. ఈ ట్రెండ్ లో తమ భాషలోనే కాక పక్క భాషల్లోనూ ఏకకాలంలో సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ లోకి వచ్చేశారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. ఆయన తాజాగా కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీ అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ ఫిల్మ్స్, భువనేశ్వరి పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
జైలర్, కెప్టెన్ మిల్లర్ వంటి భారీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు శివరాజ్ కుమార్. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీలోనూ కీ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఉన్న ఈ గుర్తింపు నేపథ్యంలోనే శివరాజ్ కుమార్ కన్నడ తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు నుంచి లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారు.