రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఆర్ సీ 16 నుంటి లేటెస్ట్ అప్డేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న ఈ రోజు ప్రకటించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర కీలకంగా ఉండనుంది. ఆర్ సీ 16గా పిలుస్తున్న ఈ సినిమాలోకి శివరాజ్ కుమార్ ను వెల్కమ్ చెబుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో శివరాజ్ కుమార్ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఆర్ సీ 16 తెరకెక్కనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు రామ్ చరణ్.