జాతీయ అవార్డును ముద్దాడిన కార్తీకేయ-2

Spread the love

కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కరాల్లో నితిన్ నటించిన కార్తీకేయ-2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (తెలుగు) నిలిచింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్, తులసి, శ్రీనివాసరెడ్డిలాంటి ప్రధాన తారాగణం నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించగా.. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గట్టి వసూళ్లే రాబట్టింది.

చదవండి: జాతీయ అవార్డు పొందిన ప్రాంతీయ చిత్రాలు ఇవే..!

బలగం లాంటి బెస్ట్ చిత్రాలు ఉండగా దీనికే ఎలా..?

వాస్తవానికి ప్రజాదరణ పొందిన చిత్రాలు, మనసుని స్పృశించే కథనంతో కూడిన కథలు చాలా వచ్చినా కూడా కార్తీకేయ-2నే ఎందుకు ఎంపికయ్యింది అన్నది సినీ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. కార్తీకేయ-2లో నిఖిల్‌ క్యారెక్టర్ ఓ వైద్యుడు. నిత్యం అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం వెతకడమంటే అతనికిష్టం. అయితే ద్వారాక వెళ్లిన తనకు కొన్ని సంఘటనలు నిశ్చేష్టుడిని చేస్తాయి. ఈ క్రమంలో సాగిన హీరో ప్రయాణం… శ్రీకృష్ణుడి చరిత్ర చుట్టూ సాగుతూ దైవం, మానవత్వం వంటి విషయాలను చెబుతూనే పతాక సన్నివేశాలతో పరిసమాప్తమవుతుంది. అయితే మంచికథే, జాతీయ అవార్డు దక్కాల్సిన సినిమానే అంటూ ఓవైపు కార్తీకేయ-2పై మాట్లాడుతున్న క్రిటిక్స్…బలగం, సీతారామం, మేజర్ లాంటి సినిమాలు అస్సలు పరిశీలనలోకే రాలేదా అన్నది వారిలో వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. నిజానికి తెలంగాణలోని ఓ గ్రామీణ నేపథ్యంతో సాగిన బలగం మూవీ ఏ రేంజ్‌లో ప్రజాదరణ అందుకుందో అందరికీ తెలిసిందే. కుటుంబ విలువలే ముఖ్యమంటూ వచ్చిన ఆ మూవీ.. సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. ఇక, దుల్కర్‌ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన నటించిన చిత్రం సీతారామం…2022లో విడుదలైన ఈ మూవీ స్వఛ్ఛమైన ప్రేమకథతో అందరి మనసులను దోచేసింది. అలాగే, అడవి శేష్‌ నటించిన మేజర్‌ ఊహించని బ్లాక్ బస్టర్‌. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ మూవీ అశేష సినీ అభిమానలోకాన్ని ఆకట్టుకుంది. ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువగా భావించి భారత సైన్యంలో చేరి ఉగ్రవాదుల కుట్రను ఎలా ఛేదిస్తాడన్నది చిత్ర సారాంశం. మరి ఇంతటి ఘనవిజయాలు, అవాక్కయ్యే వసూళ్లతో ఆడిన ఈ సినిమాలేవి కాకుండా కార్తీకేయ-2నే ఎందుకు జాతీయ అవార్డు దక్కించుకుందనేది చాలామందిని ఆలోచనలో పడేలా చేసింది.

తెరవెనుక బీజేపీ – అందుకే కార్తీకేయ-2కు దక్కిందా?

శ్రీకృష్ణుడి చరిత్రతో తెరకెక్కడంతోనే కార్తీకేయ-2కు ఆ అవకాశం వచ్చిందన్న ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. పక్కా హిందుత్వం చూపే బీజేపీ…కార్తీకేయ-2ను ఎంపికచేయడంలో తెరవెనుక పాత్ర పోషించింది అనడంలో సందేహమే లేదంటున్నారు కొందరు. అందుకే బలగం, సీతారామం, మేజర్ లాంటి సినిమాలపై బీజేపీ శీతకన్ను వేసిందన్నది వారి ఆరోపణ.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...