ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కు కావాల్సినన్ని ఆప్షన్స్ ఇస్తూ వెరైటీ ఆఫ్ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా గత నెల 31న థియేటర్స్ లో రిలీజైంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో “భజే వాయు వేగం” సినిమాను రూపొందించారు.
కార్తికేయకు బెదురులంక తర్వాత మరో హిట్ పడినట్లయ్యింది.”భజే వాయు వేగం” సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. నెట్ ఫ్లిక్స్ లో “భజే వాయు వేగం” మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని మూవీ టీమ్ ఆశిస్తోంది.