స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇవాళ ముహూర్తంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. వామికా మరో కీ రోల్ చేస్తోంది. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రెజెంట్ చేస్తుండటం విశేషం. కాళీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అట్లీ వైఫ్ ప్రియా అట్లీతో కలిసి మురాద్ కేతానీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ సినిమా మకర సంక్రాంతి సందర్భంగా ఇవాళ ముంబైలో ఓపెనింగ్ సెరెమెనీ జరుపుకుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సౌత్ లో ఆఫర్స్ తగ్గిన హీరోయిన్ కీర్తి ఈ సినిమాతో బాలీవుడ్ లో తన లక్ చెక్ చేసుకోనుంది.