కేరళ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో షూటింగ్స్‌ నిషిద్ధం..?

Spread the love

ఆస్పత్రుల్లో షూటింగ్స్‌పై హెచ్‌ఆర్‌సీ సీరియస్‌..!
కేరళ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో షూటింగ్స్‌ నిషిద్ధం..?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సినిమాల షూటింగ్‌లను నిషేధించాలని కేరళ సర్కార్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పిలుపునిచ్చింది. క్యాజువాలిటీ మేనేజ్‌మెంట్‌సహా 24 గంటల సౌకర్యాలు ఉన్న ప్రభుతాస్పత్రుల్లో సినిమా షూటింగ్‌లు జరపకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ హెచ్‌ఆర్సీ సభ్యురాలు వి.కె.బీనా కుమారి ఉత్తర్వులు జారీచేశారు.

చదవండి: నటుడు వికాస్ సేథి గుండెపోటుతో మృతి

రోగులను ఇబ్బందిపెట్టిన ఫహద్ ఫాజిల్ చిత్రబృందం..!

గత జూలై 4న నటుడు ఫహద్ ఫాజిల్‌ నటించిన పైంకిలి చిత్ర షూటింగ్‌ అంగమలీలోని ప్రభుత్వ తాలూకా ఆస్పత్రిలో జరగగా…ఆ క్రమంలో రోగులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల కమిషన్‌… ఆస్పత్రుల్లో షూటింగ్స్‌పై సీరియస్ అయింది. ఎమర్జెన్సీ వింగ్‌లో షూటింగ్‌కు ఎందుకు అనుమతిచ్చారంటూ ఎర్నాకులం జిల్లా వైద్యాధికారికి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వివరణ ఇవ్వాలంటూ తాఖీదులు పంపింది.
షూటింగ్ జరిగే సమయంలో నటీనటులు సహా సుమారు 50 మంది రెండ్రోజులు ఆస్పత్రులోనే ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు హెచ్‌ఆర్సీ సభ్యురాలు వి.కె.బీనా కుమారి. మరోవైపు, రోగులకు వైద్యులు చికిత్స అందించే సమయంలోనూ షూటింగ్స్‌కు సంబంధించి కాల్పులు జరిగాయని… చిత్రీకరణ సమయంలో రోగులు సైలెంట్‌గా ఉండాలని చిత్రయూనిట్‌ చేసిన అత్యూత్సాహం అంతా ఇంతా కాదని… ఆసలు తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగి కనీసం అత్యవసర విభాగంలోకి ప్రవేశించలేక పోయాడని…ప్రధాన ద్వారం నుంచి రోగులెవరినీ అనుమతించలేదని..దీనికి సంబంధించిన డిటెయిల్స్‌ అన్నీ తమ వద్ద ఉన్నాయని కమిషన్ సభ్యురాలు వి.కె.బీనా కుమారి స్పష్టంగా చెబుతున్నారు. మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను హెచ్‌ఆర్సీ హెచ్చరించింది.

షూటింగ్ వల్ల ఇబ్బందేమీ కలగలేదు…

ఆస్పత్రిలో షూటింగ్స్‌పై కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌ సర్వీసెస్‌ను వివరణ కోరారు. దీనిపై ఎర్నాకులం జిల్లా వైద్యారోగ్యశాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఆస్పత్రిలో జరిగిన కాల్పుల కారణంగా ఎమర్జెన్సీ వింగ్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని డైరెక్టర్‌ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌ ఎదుట నివేదిక సమర్పించింది. నిబంధనల ప్రకారమే ఆస్పత్రిలో నిర్మాణ బృందం షూటింగ్‌ జరుపుకుందని రిపోర్టులో పేర్కొనడం కొసమెరుపు.

Hot this week

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి : రిషబ్‌శెట్టి

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి నేషనల్ అవార్డు అందుకున్న కాంతారా...

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..!

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..! రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ..!జమ్మూ కశ్మీర్...

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!వరసుగా రెండు పర్యాయాలు గెలిచి హరియాణలో సర్కారు...

నాంపల్లి కోర్టులోఅక్కినేని ఫ్యామిలీ ..నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం !!

నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియరాజకీయ...

జానీమాస్టర్‌కి ఒక రూల్‌..యడ్యూరప్పకు మరో రూలా..?

జానీమాస్టర్‌ అవార్డును రద్దు చేసిన కేంద్రం..! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కర్ణాటక కాంగ్రెస్‌..!ప్రముఖ...

Topics

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..! పెద్ద గుణపాఠమన్న కేజ్రీవాల్‌.

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..!హరియాణ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా...

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణ.

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణమాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు...

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే : సీబీఐ

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే..! కోర్టులో తొలి ఛార్జిషీట్ ప్రొడ్యూస్ చేసిన సీబీఐకోల్‌కతా...