హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు కొద్దిమంది స్నేహితులు హాజరయ్యారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ వివాహ వేడుకల ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ..! సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన..?
నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఆ సినిమా టైమ్ లోనే ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ “క” లో నటిస్తున్నారు. ఈ త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు రహస్య సీయీవోగా ప్రొడక్షన్ మంచీ చెడులు చూస్తోంది.