యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. హీరోయిన్ రహస్య గోరక్ తో ఆయన వివాహానికి రేపే ముహూర్తం నిర్ణయించారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లి రేపు కర్నాటకలోని కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్. కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రుల సమక్షంలో వీరి వివాహం వేడుకలు జరగనున్నాయి.
చదవండి: సంక్రాంతి పోటీలో ఆ నలుగురు
రేపు ఆగస్టు 22న రాత్రి కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్. ఆ సినిమా వీరికి మంచి విజయాన్ని అందించడంతో పాటు ఈ జంటను ప్రేమతో ఒక్కటి చేసింది. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క త్వరలో పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.