యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్నారు. “క” సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – మూడు క లను నమ్ముకుని “క” సినిమా నిర్మించాను. అందులో మొదటి క కథ. చాలా కథలు విన్న తర్వాత “క” సినిమా కథలో డిఫరెన్స్, కంటెంట్ ఉన్నాయని బలంగా అనిపించింది. రెండో క కథానాయకుడు. కిరణ్ గారి సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక నటుడిని సరిగ్గా ఉపయోగించుకుంటే సక్సెస్ లేకుంటే ఫ్లాప్ అని నాకు అర్థమైంది. మూడో క కల. ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా నిర్మించి పది మందికి తోడుగా ఉండాలని, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడాలని మొదటనుంచి సంకల్పించుకున్నాను. నిర్మాతగా ఇది నా కల. ఆ కల “క” సినిమాతో నెరవేరుతోంది. ఈ సినిమాతో పరిచయం అవుతున్న దర్శకులు సందీప్, సుజీత్ మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంటారు. మీడియా వారంతా మా మూవీకి తమ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ -“క” సినిమా తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని మీరంతా చెప్పుకుంటారు. “క” అంటే కంటెంట్. ఆ కంటెంట్ ను మా డైరెక్టర్స్ డిజైన్ చేశారు. ఈ కథ విన్నప్పుడు వారు నాకొక మంచి ఆడియెన్స్ లా కనిపించారు. ఆడియెన్స్ దృష్టితోనే వారు కథను రాసినట్లు అనిపించింది. ఇప్పుడున్న టికెట్ రేట్స్, కాంపిటేషన్ లో ఎంతమంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది మా డైరెక్టర్స్ ఆలోచించారు. మా మూవీ సెట్ లోకి వెళ్తే పాజిటివ్ ఫీల్ కలిగేది. హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్ సపోర్టివ్ గా ఉన్నారు. ఇవాళ మా టీమ్ అంతా హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే కారణం మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. మమ్మల్ని మా ప్రాజెక్ట్ ను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన పుల్ సపోర్ట్ అందించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ ఏడాది మొదలై ఏడాదిన్నర అయ్యింది. ఇప్పుడు “క” ఫుటేజ్ చూసి బాగుంది అంటున్నాం గానీ మా ప్రొడ్యూసర్ గారు కథ విన్నప్పుడే సినిమా మీద నమ్మకం ఉంచారు. “క” తో ఒక మంచి మూవీ మీకు ఇవ్వబోతున్నా. మళ్లీ మీ ప్రేమ పొందేందుకు వేచి చూస్తున్నా. “క” ప్రొడక్షన్ వర్క్ అంతా రహస్య చూసుకుంది. సినిమా రీచ్ అయ్యాక మాట్లాడుతా అని చెప్పింది. అందుకే ఇక్కడికి రాలేదు. అన్నారు.