కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పార్టీ అనౌన్స్ చేశాడు. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఆయన తన పార్టీని నిన్న అఫీషియల్ గా ప్రకటించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపాడు. దీంతో అతని ఫిల్మ్ కెరీర్ ముగిసినట్లేనని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం గోట్ అనే మూవీ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కు మాత్రమే అతని దగ్గర డేట్స్ ఉన్నాయి.
ఆ ఛాన్స్ తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య అందుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ గా దేశమంతా గుర్తింపు తెచ్చుకున్నారు దానయ్య. ఈ గుర్తింపుతోనే విజయ్ డేట్స్ సంపాదించినట్లు చెబుతున్నారు. దానయ్య ప్రొడ్యూసర్ గా విజయ్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతోంది. అధికారికంగా త్వరలోనే ప్రకటన చేయబోతున్నారట. విజయ్ చివరి సినిమా కాబట్టి అది ప్రొడ్యూసర్ గా దానయ్యకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.